నారింజ కాయల పులేరం..
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh7BSipJxu16k3uMIrmBROtxgkOPLfz_uEaURJjF-I92USS18d4X37PeiWmUYebdTQe5MUxRgMihP6w_3Qk9J2E_9NHNEw83nNUS-ZQqlvPCivEB9B1wneOrGDKmzVAdYGlkzauNsFiadP-/w640-h604/20201126_102514.jpg)
నారింజ కాయల పులేరం... ఆరు పల్లటి నారింజ కాయలు పట్టుకెళ్లి మా ఆమ్మకిస్తే ఒకో కాయనీ రెండు పెచ్చులుగా కోసి రసం తీసి, ఒక గిన్నెలో పోసేక అందులోంచి కొంత రసం ఇంకో గిన్నెలోకి పోసి... అడ్డంగా కోసిన గుప్పెడు పచ్చిమిరపకాయల్ని ఉప్పేసి ఆ రసంలో రోజంతా నానబెట్టేది. దీంతో పచ్చటి మిరపకాయలు బంగారు రంగులోకి మారిపోయేవి. మర్నాడు, వండిన సోలెడు బియ్యం ఉన్నంలో పసుపు, ఉప్పు కలిపేది. ఎక్కువ పచ్చి శనగపప్పు వేసి పెట్టిన పోపుని, ఊరిన పచ్చిమిరపకాయల్ని, కిటికీ గూట్లో దాచిన మిగతా నారింజరసాన్నీ ఆ పసుపు అన్నంలో వేసి బాగా కలిపితే తయారయిపోయేది. నారింజ రాయల పులిహోర, ఊరిన మిరప కాయల్ని నంజుకుంటూ రెండేసి రోజులు తినేవాళ్లం ఐతే, పెళ్లయి కాపురానికి బలభద్రపురం వెళ్లిపోయిన మా అక్క అదే నారింజకాయల పులిహోర చేసేది, నా భార్య కూడా చేసేది. ఇంకా మా వాళ్లలో చాలామంది చేసేవారు. కానీ, మా అమ్మచేసిన పలిహోర రుచి వాళ్లు చేస్తే రాలేదు గాక రాలేదు అందులో ఏ ప్రేమ కలి " పేదో మా అమ్మ సూరమ్మ