గుమ్మడి బొబ్బట్లు
.గుమ్మడి బొబ్బట్లు
కావలసిన పదార్థాలు:
గుమ్మడికాయ తురుము- 3 కప్పులు,
బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు,
మైదా - ముప్పావు కప్పు,
యాలకుల పొడి ఒక టీ స్పూను,
నెయ్యి - తగినంత
...
తయారీ విధానం:
దళసరి అడుగున్న కడాయిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి గుమ్మడి తురుముని వేగించాలి. తర్వాత బెల్లం తురుము వేసి మిశ్రమాన్ని చిన్న మంట పై విక్కబడనివ్వాలి. ఇప్పుడు యాల కుల పొడి కలిపి దించేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకుని వక్కనుంచాలి. మరో పాత్రలో మైదా, స్పూను నెయ్యి వేసి నీళ్లు కలుపుతూ చపాతి పిండిలా ముద్దగా చేసుకొని గంటపాటు పక్కనుం చాలి. తర్వాత కొంత కొలత పిండి తీసుకుని ఆరచేతిలో ఒత్తి గుంతలా చేసి గుమ్మడి మిశ్రమం పెట్టి మూసి, బొబ్బట్లు ఒత్తుకోవాలి. తర్వాత పెనంపై వేసి రెండువైపులా నెయ్యితో దోరగా కాల్చుకోవాలి, వీటిని వేడిమీద ఉండగానే తింటే చాలా రుచిగా ఉంటాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి