కొబ్బరి లడ్డూ
కొబ్బరి లడ్డూ
కావలసినవి
కోవా - అరకపు
నెయ్యి • ఒక టీస్పూన్,
జీడిపప్పు • పది పలుకులు,
బాదం - పది పలుకులు,
కొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు,
చిక్కటి పాలు: ఒక కప్పు
తయారీ విధానం
స్టవ్ పై పాన్ పెట్టి కోవా వేసి కరిగించాలి. మరొక పాన్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేగించి పక్కనపెట్టుకోవాలి• అదే పాన్ లో బాదం పలుకులను కూడా వేగించి పక్క పెట్టుకోవాలి తరువాత కొబ్బరి తురుము వేసి వేగించాలి.• గోధుమరంగులోకి మారాక చిక్కటి పాలుపోయాలి.మిశ్రమం చిక్కబడిన తరువాత కరిగించిన కోవా వేయాలి• ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ, మధ్యలో జీడిపప్పు, బాదం పలుకు పెట్టి లడ్డూలుతయారుచేసుకోవాలి...చివరగా కొబ్బరి తురుము అడ్డుకుని సర్వ్ చేసుకోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి