చాక్లెట్ కేక్ పాప్స్
చాక్లెట్ కేక్ పాప్స్
కావలసినవి:
చాక్లెట్ స్పాంజ్- 1 (మార్కెట్లో దొరుకుతుంది పొడిపొడిగా చేసుకోవాలి)
చాక్లెట్ సాస్ - అర కప్పు
డైజెస్టివ్ బిస్కెట్స్ - 2,
విస్ట్ క్రీమ్ - 3 టీ స్పూన్
చాక్లెట్ చిప్స్ - 2 టీ స్పూన్లు
(అభిరుచిని బట్టి కలర్ ఫుల్ స్ప్రింకిల్స్(నచ్చిన షేప్) - 2 టీ స్పూన్లు
లాలిపాప్ స్టిక్స్ - కొన్ని
తయారీ:
ముందుగా ఒక బౌల్ లో చాక్లెట్ స్పాంజ్ పొడి, బిస్కెట్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి అందులో కొద్ది కొద్దిగా విప్ట్ క్రీమ్ జోడిస్తూ ముద్దలా మృదువుగా చేసుకోవాలి. ఆ మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్న బంతుల్లా చేసుకుని.. 2 నుంచి 3 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లాలిపాప్ స్టిక్స్ తీసుకొని, వాటిని చాక్లెట్ సాస్లో ముంచి ఒక్కో బాల్ కి ఒక్కో స్టిక్ గుచ్చి.. లాలీపాప్స్ చేసుకొని ఒక గంట పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి. తర్వాత ఈ కేక్ పాప్సని చాక్లెట్ సాలో ముంచి, దానిపై స్క్రింకేల్స్, చాక్లెట్ చిప్స్ చల్లి, సర్వ్చేసుకోవాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి