ఊదల పకోడి
ఊదల పకోడి
కావాల్సినవి:
ఊదలు- కప్పు,
సెనగపిండి కప్పు,
కారం- టీస్పూన్,
అల్లంవెల్లుల్లి పేస్టు- టేబుల్ స్పూన్,
పచ్చిమిర్చి- ఆరు
కరివేపాకు- కొద్దిగా,
సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు- నాలుగు,
ఉప్పు- తగినంత,
నెయ్యి- కొద్దిగా
తయారీ: ఊదల్ని ఎనిమిది గంటలపాటు నానబెట్టి తర్వాత ఎండబెట్టుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. గిన్నెలో ముందుగా నెయ్యి, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. దీంట్లో ఊదలపిండి, సెనగపిండి మిగిలిన పదార్థాలన్నీ వేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. అరగ్లాసు నీళ్లు పోసి పిండిని ముద్దలా చేయాలి. పిండి మరీ పలచగా, గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి పకోడీలు వేసుకుని ఎర్రగా వేయించాలి. వేరుసెనగ నూనె వాడితే పకోడీలు మరింత రుచిగా ఉంటాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి