డేట్స్ కేక్
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh1hh3b9D7ngu-liUV_T9g7vfY5v8pXG-Rx3kHLg4KXdbA1itIA98JrRgGJgVQenNzd_7M9q6MsEMVnF1T5YrOeWeZXiZG79gkYxCYgPFjjgEw6ogy-pabA_PFgtNQvN2X0OYxbulsFLADd/s1600/1606183990831113-0.png)
డేట్స్ కేక్ కావలసినవి ఖర్జూరం (డేట్స్) - 1 కప్ప గింజలు తొలగించి, ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పాలు - అర కప్పు (కాచిన వేడి పాలు) నూనె, పెరుగు, పాలు వాల్ నట్స్ తరుగు - పావు కప్పు చొప్పన గోధుమ పిండి - 1 కప్పు బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్ బేకింగ్ సోడా - పావు టీ స్పూన్ డేట్స్ తరుగు - 2 టేబుల్స్పూ న్లు తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఖర్జూరం ముక్కలు, వేడివేడి పాలు వేసుకుని, మూత పెట్టి అరగంట నానబెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో నూనె, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోదా జల్లెడలో వేసుకుని జల్లించుకుని. డేట్స్ మిశ్రమంలో కలుపుకోవాలి ఇప్పుడు పాలు వేసుకుని మరోసారి బాగా పేస్ట్ లాకలుపుకుని.. కొన్ని వాల్ నట్స్ ముక్కలు, డేట్స్ ముక్కలు వేసుకుని పోంగ్బాలో మొత్తం మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు పైన మిగిలిన వాల్ నట్స్ ముక్కలు, డేట్స్ ముక్కలు వేసుకుని ఓవెన్లో పెట్టుకుని 180 డిగ్రీల టెంపరేచర్‌లో సుమారు 45 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే డేట్స్ కేక్ సిద్ధమవుతుంది