మసాలా క్రీ
మసాలా క్రీ
కావలసిన పదార్థాలు |
మప్రామ్స్ - పావు కిలో,
ఆలూ (పెద్దది) - 1,
ఉల్లిపాయ - 1,
టమోటా - 1,
అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను,
నూనె టేబుల్ స్పూన్లు,
ఉప్పు - రుచికి తగినంత,
పసుపు - పావు టీ స్పూను,
కారం, గరం మసాల, ధనియాల పొడి - ఒక టీ స్పూను చొప్పున,
పెరుగు - 3 టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తరుగు - అరకప్పు,
కస్తూరి మేతి చిటికెడు,
బిర్యాని ఆకు - 1,
యాలకులు లవంగాలు 5 చొప్పున,
దాల్చినచెక్క ఆంగుళం ముక్క
తయారుచేసే విధానం
తరిగిన మహ్రూమ్, ఆలూ ముక్కలను విడివిడిగా కొద్ది సేపు నూనెలో వేగించి పక్కనుంచాలి, తర్వాత అదే కడాయిలో మరి కొద్దిగా నూనె వేసి బిర్యాని ఆకు, యాలకులు లవంగాలు, చిదిమిన దాల్చిన చెక్క ఉల్లి త రుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, టమోటా ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి, ఇప్పుడు పెరుగు కూడా వేసి రెండు నిమిషాల తర్వాత కారం, ఉప్పు, మప్రూమ్ ఆలూ ముక్కలు కలిపి అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టి పదినిమిషాలు మగ్గించాలి. తర్వాత ధని యాల పొడి, గరం మసాల, కస్తూరి మేతి, కొత్తిమీర తరుగు చల్లి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. ఈ కర్రీ అన్నం లేదా పరాటాల్లోకి చాలా బావుంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి