బనానా బొబ్బట్లు
కావలసినవి: అరటిపండ్లు - 3
గోధుమ పిండి - ఒకటిన్నర కప్పులు
ఉప్పు - చిటికెడు
పసుపు - పావు టీ స్పూన్
నెయ్యి టేబుల్ స్పూన్ 1 నీళ్లు -
కొద్దిగా, జీడిపప్పు, బాదం - 10 చొప్పున
ఏలకులు - 4
బొంబాయి రవ్వ - పావు కప్ప
బెల్లం తురుము - అర కప్పు తయారీ: ముందుగా జీడిపప్పు బాదం, ఏలకులు మిక్సీలో
వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని, అందులో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, 1 జేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిపి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా.. మరీ మెత్తగా కాకుండా సెమీ సాప్ట్ గా చేసుకుని 10 నిమిషాలు
మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అరటిపండ్లను మిక్సీ పట్టుకుని పేస్ట్ లా చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని, పాన్లో 2 టీ స్పూన్లు వెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసుకుని సుమారు రెండు నుంచి మూడు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ దోరగా వేయించాలి. అందులో అరటిపండ్ల పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ.. మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు బెల్లం తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత జీడిపప్పు, బాదం పౌడర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి. మరో టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా తిప్పి.. ఒక బౌలోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు గోధుమ పిండి ముద్దను మరోసారి చేత్తో కలుపుకుని.. నిమ్మకాయ సైజ్లో చిన్న చిన్న బాల్స్ తీసుకుని.. చేత్తోనే గిన్నెలా చేసుకోవాలి దానిలో అంతే పరిమాణంలో అరటిపండు మిశ్రమాన్నిపెట్టుకుని.. చుట్టు ఫోర్ట్ చేసుకుని.. బాలా చేసుకోవాలి. కొద్దికొద్దిగా పొడి గోధుమ పిండి వేసుకుంటూ.. చపాతీల్లా చేసుకుని. నేతిలో దోరగా వేయించుకుంటే టేస్టీ బనానా బొబ్బట్లు రెడీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి