సూర్యకళ
కావలసినవి:
మైదా: కప్పు,
కరిగించిన నెయ్యి టేబుల్ స్పూను,
ఉప్పు: చిటికెడు
వంటసోడా: చిటికెడు ,
స్టఫింగ్ కోసం:
చక్కెరలేని కోవా: అర కప్పు,
చక్కెరపొడి: పావుకప్పు,
జీడిపప్పు అయిదు,
పిస్తా: పది
, బాదం: అయిదు
యాలకులపొడి: అరచెంచా,
పాకంకోసం:
చక్కెర: కప్పు,
నీళ్లు: అరకప్పు,
యాలకులపొడి: పావుచెంచా,
తయారీ విధానం:
ఓ గిన్నెలో మైదా, వంటసోడా, చిటికెడు ఉప్పు, నెయ్యి వేసి దాగా కలపాలి. తరువాత నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా చేసుకోవాలి ఇప్పుడు స్టామీద కడాయి పెట్టి నూనె లేకుండా జీడిపప్పు, బాదం, పిస్తా పలుకుల్ని వేయించి.. తరువాత పొడి చేసుకోవాలి. తరువాత ఇందులో చక్కెరపొడి, యాలకులపొడి, కోవా వేసి కలుపుకోవాలి. అదేవిధంగా చక్కెర, నీళ్లు గిన్నెలో తీసుకుని సొమీద పెట్టాలి. ఇది తీగపాకంలా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని తీసుకుని పూరీలా వత్తు కోవాలి. దాని మధ్యలో రెండు చెంచాలు కోవా మిశ్రమాన్ని ఉంచి.. పైన అదే సైజులో ఇంకో పూరీని ఉంచి అంచులు ఓ డిజైనులో వచ్చేలా మూసేయాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకుని పాకంలో వేయాలిపదినిమిషాలయ్యాక ఇవతలకు తీస్తే సరి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి