కందిపప్పుపరోటా

 




కందిపప్పు పరోటా


కావలసినవి:

 గోధుమ పిండి - 2 కప్పులు


కందిపప్పు-1 కప్పు


జీలకర్ర - 1 టీ స్పూన్


నెయ్యి - 2 టీ స్పూన్లు


పసుపు - చిటికెడు


కారం - 1 టీ స్పూన్


ఉప్పు - తగినంత


ఇంగువ - చిటికెడు


నూనె - సరిపడా


తయారీ:

 మొదట గోధుమ పిండిని పరోటా ఎలా కలుపుకుంటామో అలా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు కందిపప్పును బాగా కడిగి, నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి... అర టేబుల్ స్పూన్ నూనె వేసుకుని, వేడెక్కాక.. జీలకర్ర, ఇంగువ, ఉడికించిన కందిపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకుని, పొడిపొడిగా అయ్యే వరకూ గరిటెతో తిప్పాలి. ఇప్పుడు స్టవ్ఆఫ్ చేసుకుని, ఆ మిశ్రమం కాసేపు చల్లారే వరకూ పక్కన పెట్టుకోవాలి. అనంతరం ముందుగా కలిపి పెట్టుకునా పరోటా పిండిని ఉండల్లా చుట్టి చపాతీలా చేసుకోవాలి. ప్రతి చపాతి మధ్యలో కొద్ది కొద్దిగా కందిపప్పు మిశ్రమం పెట్టి అంచుల్ని మూసి మరోసారి చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని, పెనంపై నెయ్యి వేసి. పరోటాలని ఇరువైపులా దోరగా కాల్చుకోవాలి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు