స్వీట్ దోశెలు

 




స్వీట్ దోశెలు


కావలసినవి


బియ్యప్పిండి- అర కప్పు,

 గోధుమ పిండి - 1 కప్పు 

కొబ్బరి తురుము - 4 టీ స్పూన్లు, 

బెల్లం తురుము 1 కప్పు

నెయ్యి - పావు కప్పు, 

శొంఠి పొడి-చిటికెడు 

ఏలకుల పొడి - అర టీ స్పూన్

జీడిపప్పు, కిస్మిస్ - గుప్పెడు (పేస్ట్ చేసుకోవాలి)


తయారీ: 


❤ముందుగా బెల్లం తురుములో సరిపడా నీళ్లు పోసి లేత పాకం పట్టుకోవాలి. ఈలోపు పెద్ద బౌల్ తీసుకుని.. అందులో బియ్యప్పిండి, గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొబ్బరి తురుము, శొంఠి పొడి, ఏలకుల పొడి కూడా వేసి, మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ గోధుమపిండి మిశ్రమాన్ని ముద్దలా చేసుకోవాలి అందులో జీడిపప్పు, కిస్మిస్ పేస్ట్ వేసుకుని బాగా కలిపి. అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవచ్చు. మరీ పలుచుగా కాకుండా దోసెల పిండిలా చేసుకుని.. దోసెలు వేసుకుంటే భలే రుచిగా ఉంటాయి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు