చికెన్ కరీ
చికెన్ కరీ
కావలసిన పదార్థాలు
చికెన్ - అరకేజీ,
ఉల్లిపాయలు - 2,
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూను,
ఉప్పు - రుచికి తగినంత,
నూనె - 3 టేబుల్ స్పూన్లు,
కరివేపాకు - ఒక కప్పు,
పచ్చి మిర్చి - 3,
జీడిపప్పు - 10,
ధనియాలు ఒక టేబుల్ స్పూను,
గరం మసాల పొడి పసుపు - ఒక టీ స్పూను చొప్పున,
కారం - ఒక టేబుల్ స్పూను,
పచ్చికొబ్బరి తురుము - ఒక టేబుల్ స్పూను,
కొత్తిమీర తరుగు - అరకప్పు
తయారుచేసే విధానం
ఒక టేబుల్ స్పూను నూనెలో జీడిపప్పు, ధనియాలు, కరివే పాకు, పచ్చిమిర్చి ఒకటి తర్వాత ఒకటి వేగించి, చల్లారిన తర్వాత పచ్చికొబ్బరి తురుముతో పాటు పేస్టు చేసుకొని పక్కనుంచాలి. ఇప్పుడు మిగతా నూనెలో ఉల్లిపాయ తరుగు దోరగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేవరకు వేగించాలి. తర్వాత కారం, పసుపు, గరం మసాలా పొడి, ఉప్పు వేసి రెండు నిమి షాల తర్వాత చికెన్ ముక్కలు జత చేయాలి నీరంతా ఆవిరయ్యాక కరివే పాకు మిశ్రమం, కొద్దిగా నీరు కలిపి మూత పెట్టి ఉడికించాలి చికెన్ మెత్తబడ్డాక కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. ఈ కర్రీ రైస్ / పరాటా లతో బాగుంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి