లుక్ష్మీ సమోసా
![చిత్రం](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhPsRACbtZh7iZOMbPvVrZvtwPMW6TqKgJQ_DCH17boaYRnVn3Fd4EahAZ7lDA7NtNV7asjj-0qWNFx0SUHZyvqAr8j1P00JxLq6FJCnWLPCVpGnKgx1EO6Da9wbziJm_7GNrQgVMJRQIXM/s1600/1606011064992757-0.png)
లుక్ష్మీ సమోసా కావలసిన పదార్థాలు: గోధమపిండి రెండు కప్పులు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూను, టొమాటో కెచప్, చిల్లీ సాస్ - రెండు టీ స్పూన్లు చొప్పున, ఉల్లి తరుగు - అరకప్పు, అల్లం, పచ్చిమిర్చి తరుగు ఒక టీ స్పూను చొప్పున, జీరాపొడి, కారం గరం మసాలా ఒక టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి, కొత్తిమీర తరుగు గుప్పెడు. నూనె - వేగించడానికి సరిపడా తయారుచే సే విధానం: ఒక పాత్రలో గోధుమపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, చిటికెడు ఉప్పు వేసి గోరువెచ్చని నీటితో ముద్దగా కలిపి పక్కనుంచాలి. కడాయిలో నూనె వేసి ఉల్లి, అల్లం పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీరా, పసుపు, గరం మసాలా, కారం పొడులు, కొత్తిమీర తరుగు వేసి వేగించాలి. ఇప్పుడు గోధుమ పిండి ముద్దను సమాన భాగాలుగా చేసి పూరీలుగా ఒత్తి టొమాటో కెచప్ చిల్లీ సాస్ పూసి, ఒక వైపున ఉల్లి మిశ్రమం పెట్టి, పూరీ మడిచి అంచులు వత్తాలి. తర్వాత పెనంపై నూనె రాసి రెండు వైపులా దోరగా వేగించాలి.