పోస్ట్‌లు

సామల ఖీర్

చిత్రం
  సామల ఖీర్ కావలసినవి సామలు - ఒక కప్పు,  నెయ్యి - ఒక టేబుల్ స్పూను,  జీడి పప్పు  పలుకులు- 10  కిసిమిస్ - ఒక టేబుల్ స్పూను,  బెల్లం పొడి- ఒక కప్పు కొబ్బరి పాలు - ఒక కప్పు,  ఏలకుల పొడి- అర టీ న్యూను  తయారీ:  సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, క్రిస్మస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్థా మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు అతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్ది సేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.

సామల దధ్యోదనం

చిత్రం
 సామల దధ్యోదనం కావలసినవి సామలు- అర కప్పు,  నీళ్లు -2 కప్పులు పెరుగు- ముప్పావు కప్పు,  కొబ్బరి పాలు- పావు కప్పు  2 టీ స్పూన్లు, ఉప్పు క్యారట్-3 టీ స్పూన్లు,  కొత్తిమీర తరుగు వెయ్యిమా - ఒక టీ స్పూను,  ఆవాలు అర టీ స్పూను మినప్పప్పు- అరటీస్పూను,  కరివేపాకు 2 రెమ్మలు  తరిగిన పచ్చి మిర్చి-2,  అల్లం తురుము - ఒక టీ స్పూను - తగినంత తయారీ:  ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్థా మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. పెరుగు, కొబ్బరి పాలు జత చేసి కలియబెట్టాలి. స్థా మీద బాణలి ఉంది వేడయ్యాక నూనె/నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. క్యారట్ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలియబెట్టాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించి, అల్లం చట్నీతో అందించాలి

సామలు పుట్ట గొడుగుల బిర్యానీ

చిత్రం
  సామలు పుట్ట గొడుగుల బిర్యానీ కావలసినవి: సామలు - ఒక కప్పు, వెయ్యి - 2 టీ స్పూన్లు తరిగిన పుట్ట గొడుగులు - 100 గ్రా..  ఉల్లి తరుగు - పావు కప్పు  టొమాటో తరుగు - పావు కప్పు,  అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను పసుపు - అర టీ స్పూను,  మిరప కారం - ఒక టీ స్పూను  గరం మసాలా - ఒక టీ స్పూను,  ఉప్పు - తగినంత నీళ్లు - 2 కప్పులు (చిరుధాన్యాలకి) + పావు కవ్పు (పుట్టగొడుగులమసాలా కొత్తిమీర - ఒక కప్పు  పుదీనా- అర కప్పు తరిగిన పచ్చి మిర్చి - 1,  ఏలకులు- 1,  లవంగాలు - 4,  బిర్యానీ ఆకు - 1 దాల్చిన చెక్క - చిన్న ముక్క,  జావత్రి - చిన్న ముక్క సోంపు గింజలు - ఒక టీ స్పూను జీలకర్ర - ఒక టీ స్పూను  కరివేపాకు - 2 రెమ్మలు తయారీ:  స్థా మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్థామీద కుకర్ ఉంచి వేడయ్యాక. నెయ్యి వేసి కరిగించాలి. బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు దాల్చిన చెక్క ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్...

సామల టొమాటో పులావ్

చిత్రం
  సామల టొమాటో పులావ్ కావలసినవి సామలు - ఒక కప్పు,  ఉల్లి తరుగు పావు కప్పు తరిగిన పచ్చి మిర్చి - రెండు క్యారట్ తరుగు - ఒక టేబుల్ స్పూను,  కరివేపాకు - 2 రెమ్మలు అల్లం తురుము - ఒక టీ స్పూను ఆవాలు - ఒక టీ స్పూను,  పచ్చి సెనగ పప్పు - ఒక టీ స్పూను మినప్పప్పు - ఒక టీ స్పూను  టొమాటో తరుగు - పావు కప్పు,  పసుపు - పావు టీ స్పూను నెయ్యినూనె - 2 టీ స్పూన్లు  మిరప కారం - పావు టీ స్పూను,  కొత్తిమీర - ఒక టేబుల్ స్పూను,  నీళ్లు, ఉప్పు - తగినంత.  ఉడికించిన బఠాణీ - ఒక కప్పు,  తయారీ:  సామలకు తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడిగి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. స్టా మీద కుకర్ ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి /నూనె వేసి కాగాక ఆవాలు, వచ్చి సెనగ పప్పు, మినప్పప్పు ఉల్లి తరుగు, అల్లం తురుము, వచ్చి మిర్చి తరుగు, ఉడికించిన బఠాణీలు, క్యారట్ తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. టొమాటో తరుగు, వనువు, మిరప కారం వేసి మరోమారు కలపాలి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. సామలలో నీళ్లు ఒంపేయాలి. మరుగుతున్న నీటిలో సామలు వేసి కలియబెట్టి మూత పెట్టేయాలి. మూడు విజి...

కొర్రలు - క్యాబేజీ ముత్తియాస్

చిత్రం
  కొర్రలు - క్యాబేజీ ముత్తియాస్ కావలసినవి  తురిమిన క్యాబేజీ - ఒక కప్పు కొర్ర పిండి - ఒక కప్పు పెరుగు - టేబుల్ స్పూన్లు  నిమ్మ రసం - ఒక టీ స్పూను అల్లం + వచ్చి మిర్చి ముద్ద - ఒక టీ స్పూను పసుపు - అర టీ స్పూను  బేకింగ్ సోడా- చిటికెడు ఉప్పు - తగినంతపోపు కోసం నెయ్యి, నూనె - ఒక టీ స్పూను  జీలకర్ర - ఒక టీ స్పూను ఇంగువ - పావు టీ స్పూను  కరివేపాకు - 4 రెమ్మలు కొత్తిమీర - అలంకరించడానికి తగినంత  తయారీ:  ఒక గిన్నెలో తురిమిన క్యాబేజీ కొర్ర పిండి పెరుగు, నిమ్మ రసం. వచ్చి మిర్చి ముద్ద, పసుపు, టేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి తగినన్ని నీళ్ళు జత చేసి మెత్తటి పిండిగా తయారుచేసుకోవాలి. ఉండలు చేసి చేతితో వడ మాదిరిగా ఒత్తాలి. ప్టా మీద పెనం ఉంది. వేడయ్యాక కొద్దిగా మానె వేసి తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్లను ఒకటొక్కటిగా వేస్తూ రెండువైపులా కాల్చాలి. స్టామీద బాణలి ఉంచి వేడయ్యాక చెయ్యి మాచె వేసి కాచాలి. జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్ని పోవులో వేసి వేయించాలి. కొత్తిమీరతో అలంకరించి పాస్తో ప్లేట్లో ఉంచి అందించాలి

కొర్రల హల్వా

చిత్రం
  కొర్రల హల్వా కావలసినవి నెయ్యి - ఒక కప్పు  కొబ్బరి పాలు - ఒక కప్పు,  కొర్ర పిండి - ఒక కప్పు బెల్లం పొడి - ఒక కప్పు జీడి పప్పులు - 10 కిస్మిస్ - ఒక టేబుల్ స్పూను  బాదం పప్పులు - ఒక టేబుల్ స్పూను తయారీ సౌ మీద బాణలిలో ఒక చెంచాడు నెయ్యి వేసి కరిగాక, కొర్ర పిండి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి పాలు జత చేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా ఉడుకుతుండగా బెల్లం పొడి వేసి అది కరిగేవరకు కలుపుతుండాలి. మిగతా నెయ్యి జత చేసి బాగా కలిపి ఉడికించాలి. చిన్న బాణలి స్టా మీద ఉంచి కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్మిస్, బాదం పప్పులు వేసి దోరగా వేయించి, ఉడికించిన హ్వూలో వే కలపాలి. కొద్దిగా చల్లారాక కప్పులలో అందించాలి

కొర్ర బ్రెడ్

చిత్రం
 కొర్ర బ్రెడ్ కావలసినవి కొబ్బరి పాలు - అర కప్పు  కొర్ర పిండి - ఒక కప్పు ఈస్ట్ - అర టీ స్పూను,  నీళ్లు - అర కప్పు  బెల్లం పొడి 2 టీ స్పూన్లు ఉప్పు - తగినంత బ్రెడ్ ఇంప్రూవర్ -0.05 గ్రా.  గోధుమ పిండి - ఒకటిన్నర కప్పులు తయారీ స్టా మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు, వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి. బ్రెడ్ ఇంప్రూవర్ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెనను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్ పాన్ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రేలో ఉంచి, అవెన్లో పెట్టి పావు గంట సేపు బేక్ చేసి తీసేయాలి.