సామలు పుట్ట గొడుగుల బిర్యానీ
సామలు పుట్ట గొడుగుల బిర్యానీ
కావలసినవి:
సామలు - ఒక కప్పు,
వెయ్యి - 2 టీ స్పూన్లు
తరిగిన పుట్ట గొడుగులు - 100 గ్రా..
ఉల్లి తరుగు - పావు కప్పు
టొమాటో తరుగు - పావు కప్పు,
అల్లం వెల్లుల్లి ముద్ద- ఒక టీ స్పూను
పసుపు - అర టీ స్పూను,
మిరప కారం - ఒక టీ స్పూను
గరం మసాలా - ఒక టీ స్పూను,
ఉప్పు - తగినంత
నీళ్లు - 2 కప్పులు (చిరుధాన్యాలకి) + పావు కవ్పు (పుట్టగొడుగులమసాలా
కొత్తిమీర - ఒక కప్పు
పుదీనా- అర కప్పు
తరిగిన పచ్చి మిర్చి - 1,
ఏలకులు- 1,
లవంగాలు - 4,
బిర్యానీ ఆకు - 1
దాల్చిన చెక్క - చిన్న ముక్క,
జావత్రి - చిన్న ముక్క
సోంపు గింజలు - ఒక టీ స్పూను
జీలకర్ర - ఒక టీ స్పూను
కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ:
స్థా మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్థామీద కుకర్ ఉంచి వేడయ్యాక. నెయ్యి వేసి కరిగించాలి. బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు దాల్చిన చెక్క ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా ఉప్పు కారం, పసుపు, కరివేపాకు. పచ్చి మిర్చి తరుగు వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరవాత తరిగి ఉంచుకున్న పుట్టగొడుగులు. కొద్దిగా నీళ్లు పోస్ ఉడికించాలి, సామలు జతచేయాలి. కొద్దిగా నీళ్లు కొంచెం కరివేపాకు. పుదీనా ఆకులు వేసి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేసి, మూత తీశాక కొత్తిమీరతో అలంకరించాలి. రైతాతో వడ్డించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి