సామల దధ్యోదనం
సామల దధ్యోదనం
కావలసినవి
సామలు- అర కప్పు,
నీళ్లు -2 కప్పులు
పెరుగు- ముప్పావు కప్పు,
కొబ్బరి పాలు- పావు కప్పు
2 టీ స్పూన్లు, ఉప్పు
క్యారట్-3 టీ స్పూన్లు,
కొత్తిమీర తరుగు వెయ్యిమా - ఒక టీ స్పూను,
ఆవాలు అర టీ స్పూను
మినప్పప్పు- అరటీస్పూను,
కరివేపాకు 2 రెమ్మలు
తరిగిన పచ్చి మిర్చి-2,
అల్లం తురుము - ఒక టీ స్పూను
- తగినంత
తయారీ:
ముందుగా సామలను శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలపాటు నానబెట్టాలి. నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్థా మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికిన సామల అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, గరిటెతో మెత్తగా అయ్యేలా మెదపాలి. పెరుగు, కొబ్బరి పాలు జత చేసి కలియబెట్టాలి. స్థా మీద బాణలి ఉంది వేడయ్యాక నూనె/నెయ్యి వేసి కాగనివ్వాలి. ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. క్యారట్ తురుము జత చేసి మరోమారు వేయించి, సామల అన్నంలో వేసి కలియబెట్టాలి. ఉప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. కొత్తిమీరతో అలంకరించి, అల్లం చట్నీతో అందించాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి