సామల ఖీర్
సామల ఖీర్
కావలసినవి
సామలు - ఒక కప్పు,
నెయ్యి - ఒక టేబుల్ స్పూను,
జీడి పప్పు
పలుకులు- 10
కిసిమిస్ - ఒక టేబుల్ స్పూను,
బెల్లం పొడి- ఒక కప్పు
కొబ్బరి పాలు - ఒక కప్పు,
ఏలకుల పొడి- అర టీ న్యూను
తయారీ:
సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి. మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, క్రిస్మస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్థా మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. కొబ్బరి పాలు అతచేయాలి. బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్ది సేపు ఉడికించాలి. ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్ జత చేసి కలిపి దింపేయాలి. వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి