పోస్ట్‌లు

నారింజ కాయల పులేరం..

చిత్రం
  నారింజ కాయల పులేరం... ఆరు పల్లటి నారింజ కాయలు పట్టుకెళ్లి మా ఆమ్మకిస్తే ఒకో కాయనీ రెండు పెచ్చులుగా కోసి రసం తీసి, ఒక గిన్నెలో పోసేక అందులోంచి కొంత రసం ఇంకో గిన్నెలోకి పోసి... అడ్డంగా కోసిన గుప్పెడు పచ్చిమిరపకాయల్ని ఉప్పేసి ఆ రసంలో రోజంతా నానబెట్టేది. దీంతో పచ్చటి మిరపకాయలు బంగారు రంగులోకి మారిపోయేవి. మర్నాడు, వండిన సోలెడు బియ్యం ఉన్నంలో పసుపు, ఉప్పు కలిపేది. ఎక్కువ పచ్చి శనగపప్పు వేసి పెట్టిన పోపుని, ఊరిన పచ్చిమిరపకాయల్ని, కిటికీ గూట్లో దాచిన మిగతా నారింజరసాన్నీ ఆ పసుపు అన్నంలో వేసి బాగా కలిపితే తయారయిపోయేది. నారింజ రాయల పులిహోర, ఊరిన మిరప కాయల్ని నంజుకుంటూ రెండేసి రోజులు తినేవాళ్లం ఐతే, పెళ్లయి కాపురానికి బలభద్రపురం వెళ్లిపోయిన మా అక్క అదే నారింజకాయల పులిహోర చేసేది, నా భార్య కూడా చేసేది. ఇంకా మా వాళ్లలో చాలామంది చేసేవారు. కానీ, మా అమ్మచేసిన పలిహోర రుచి వాళ్లు చేస్తే రాలేదు గాక రాలేదు అందులో ఏ ప్రేమ కలి " పేదో మా అమ్మ సూరమ్మ

తీపి పొంగలి

చిత్రం
  తీపి పొంగలి కావలసిన పదార్థాలు:  బియ్యం - అరకప్పు,  పెసరపప్పు - అరకప్పు , జీడిపప్పు - 10,  కిస్మిస్ - 10,  యాలకులు - 10,  బెల్లం - ఒక కప్పు,  నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు  తయారీ విధానం:  ముందుగా బియ్యం, పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీరుపోసి అరగంట పక్కనుంచాలి. నెయ్యిలో కిస్మిస్, జీడిపప్పులు వేగించి పక్కనుంచాలి. కడా యిలో బెల్లం వేసి ఒక కప్పు నీరు పోసి మరిగించాలి. మరిగిన తర్వాత వడకట్టి బెల్లం నీటిని పక్కనుంచాలి. కుక్కర్లో బియ్యం, పప్పు వేసి 2 కప్పుల నీరు, 3 యాలకులు వేసి 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. చల్లారాక గరిటతో బాగా మెదిపి బెల్లం నీరు కలపాలి ఈ మిశ్రమాన్ని మరో పది నిమిషాలు చిక్కబడే వరకు ఉడికించాలి. చివరలో కొద్దిగా నెయ్యి వేసి కిస్ మిస్, జీడిపప్పు, యాల కుల పొడి కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి

గుమ్మడి బొబ్బట్లు

చిత్రం
 .గుమ్మడి బొబ్బట్లు కావలసిన పదార్థాలు:  గుమ్మడికాయ తురుము- 3 కప్పులు,  బెల్లం పొడి - ఒకటిన్నర కప్పులు,  మైదా - ముప్పావు కప్పు,  యాలకుల పొడి ఒక టీ స్పూను,  నెయ్యి - తగినంత ... తయారీ విధానం:  దళసరి అడుగున్న కడాయిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి గుమ్మడి తురుముని వేగించాలి. తర్వాత బెల్లం తురుము వేసి మిశ్రమాన్ని చిన్న మంట పై విక్కబడనివ్వాలి. ఇప్పుడు యాల కుల పొడి కలిపి దించేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజు ఉండలుగా చేసుకుని వక్కనుంచాలి. మరో పాత్రలో మైదా, స్పూను నెయ్యి వేసి నీళ్లు కలుపుతూ చపాతి పిండిలా ముద్దగా చేసుకొని గంటపాటు పక్కనుం చాలి. తర్వాత కొంత కొలత పిండి తీసుకుని ఆరచేతిలో ఒత్తి గుంతలా చేసి గుమ్మడి మిశ్రమం పెట్టి మూసి, బొబ్బట్లు ఒత్తుకోవాలి. తర్వాత పెనంపై వేసి రెండువైపులా నెయ్యితో దోరగా కాల్చుకోవాలి, వీటిని వేడిమీద ఉండగానే తింటే చాలా రుచిగా ఉంటాయి.

వెల్లుల్లితో చారు..

చిత్రం
కావలసినవి: వెల్లుల్లి రెబ్బలు పది చింతపండు! నిమ్మకాయంత, ఎండుమిర్చి : రెండు, మిరియాలు: అరచెంచా వనియాలు: చెంచా, సెనగపప్పు: అరచెంచా, జీలకర్ర: రెండు చెంచాలు,  కరివేపారు. రెండు రెబ్బలు, నూని రెండు చెంచాలు, ఉప్పు: తగినంత, ఆవాలు: అరచెంచా,  తయారీ విధానం: చింతపండును కప్పు నీటిలో నానబెట్టి తరువాత రసం తీసుకోవాలి. స్టామీద ఆదాయ పెట్టి చెంచా నూనె వేసి ఎండుమిర్చి, మిరియాలు, దనియాలు, సేన పప్పును వేయించుకుని వేడి చల్లారాక మిక్సీలో వేసి చెంచా జీలకర్ర, కొద్దిగా మ ఇది పాకు, వెల్లుల్లితో కలిపి ముద్దలా చేసుకోవాలి. బాణలిని మీద పెట్టి మిగిలిన నూనె వేసి ఆవాలు, మిగిలిన జీలకర్ర, కరివేపాకు వేయించి ఒకటిన్నర కప్పు చింతపండు నీళ్లు, తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న వెల్లుల్లి మసాలా వేసి.. మరికాసిని నీళ్లు పోయాలి. బాగా మరిగాక దింపేయాలి.

బనానా బొబ్బట్లు

చిత్రం
బనానా బొబ్బట్లు కావలసినవి: అరటిపండ్లు - 3 గోధుమ పిండి - ఒకటిన్నర కప్పులు ఉప్పు - చిటికెడు పసుపు - పావు టీ స్పూన్ నెయ్యి టేబుల్ స్పూన్ 1 నీళ్లు -  కొద్దిగా, జీడిపప్పు, బాదం - 10 చొప్పున ఏలకులు - 4 బొంబాయి రవ్వ - పావు కప్ప బెల్లం తురుము - అర కప్పు తయారీ: ముందుగా జీడిపప్పు బాదం, ఏలకులు మిక్సీలో వేసుకుని మెత్తగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని, అందులో గోధుమ పిండి, ఉప్పు, పసుపు, 1 జేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలిపి కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా.. మరీ మెత్తగా కాకుండా సెమీ సాప్ట్ గా చేసుకుని 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అరటిపండ్లను మిక్సీ పట్టుకుని పేస్ట్ లా చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని, పాన్లో 2 టీ స్పూన్లు వెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసుకుని సుమారు రెండు నుంచి మూడు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ దోరగా వేయించాలి. అందులో అరటిపండ్ల పేస్ట్ వేసుకుని గరిటెతో తిప్పుతూ.. మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు బెల్లం తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడిన...

బ్రెడ్ బాల్స్

చిత్రం
బ్రెడ్ బాల్స్ కావలసినవి: బంగాళదుంపలు - 3 (మెత్తగా ఉడికించి, ముద్దలా చేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, పసుపు జీలకర్ర పొడి, గరం మసాలా , ధనియాల పొడి ఆమ్చూర్ పొడి, వాము పొడి - అర టీ స్పూన్ చొప్పున పుదీనా తరుగు - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - తగినంత బ్రెడ్ స్ెస్ - 8 లేదా 10 బ్రెడ్ పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారీ:  ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, వాము పొడి, పుదీనా తరుగు సరిపడి ఉప్పు వేసుకుని ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ వై నాలుగు వైపులా బ్రౌన్ కలర్ భాగాన్ని తొలగించి.. నీటిలో అర నిమిషం పాటు నానబెట్టి, గట్టిగా ఒత్తుకుని.. అందులో ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుని.. వాటిని ఒక్కో బ్రెడ్ సైన్లో పెట్టుకుని నాలుగువైపులా మూసి ఉండల్లా చేసుకోవాలి. వాటికి బ్రెడ్ పౌడర్ పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి

డేట్స్ కేక్

చిత్రం
డేట్స్ కేక్ కావలసినవి ఖర్జూరం (డేట్స్) - 1 కప్ప గింజలు తొలగించి, ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి పాలు - అర కప్పు (కాచిన వేడి పాలు) నూనె, పెరుగు, పాలు వాల్ నట్స్ తరుగు - పావు కప్పు చొప్పన గోధుమ పిండి - 1 కప్పు బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్  బేకింగ్ సోడా - పావు టీ స్పూన్ డేట్స్ తరుగు - 2 టేబుల్స్పూ న్లు తయారీ:  ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఖర్జూరం ముక్కలు, వేడివేడి పాలు వేసుకుని, మూత పెట్టి అరగంట నానబెట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో నూనె, పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోదా జల్లెడలో వేసుకుని జల్లించుకుని. డేట్స్ మిశ్రమంలో కలుపుకోవాలి ఇప్పుడు పాలు వేసుకుని మరోసారి బాగా పేస్ట్ లాకలుపుకుని.. కొన్ని వాల్ నట్స్ ముక్కలు, డేట్స్ ముక్కలు వేసుకుని పోంగ్బాలో మొత్తం మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు పైన మిగిలిన వాల్ నట్స్ ముక్కలు, డేట్స్ ముక్కలు వేసుకుని ఓవెన్లో పెట్టుకుని 180 డిగ్రీల టెంపరేచర్‌లో సుమారు 45 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే డేట్స్ కేక్ సిద్ధమవుతుంది