అరికల కొత్తిమీర అన్నం
అరికల కొత్తిమీర అన్నం
కావలసినవి:
అరికలు - ఒక కప్పు
నీళ్లు - 2 కప్పలు
ఉప్పు - తగినంత,
బిర్యానీ ఆకు - 1
ఉల్లి తరుగు - పావు కప్పు
క్యారట్ తరుగు - అర కప్పు
టొమాటో తరుగు - అర కప్పు
కరివేపాకు - 2 రెమ్మలు
నెయ్యి/నూనె - 2 టీ స్పూన్లు
కొత్తిమీర ఒక కప్పు,
(కొద్దిగా నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి) పుదీనా - పావు కప్పు,
తరిగిన పచ్చి మిర్చి --1
మసాలా దినుసులు
లవంగాలు - 1,
వెల్లుల్లి రెబ్బలు - 2
అల్లం తురుము - అర టీ స్పూను
తయారీ:
అరికల బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుకర్లో కడిగిన అరికల జయ్యంనీళ్లు, ఉప్పు, బిర్యానీ ఆకు వేసి మూత పెట్టి, సన్నటి మంట మీద ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. మీద బాణలిలో నెయ్యి/ నూనె వేసి కాగాక మసాలా దినుసులు వేసి కొద్దిసేపు వేయించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. తరిగిన క్యారట్, టొమాబో తరుగు జత చేసి కలియబెట్టాలి. కొత్తిమీర ముద్దను జత చేసి బాగా కలియబెట్టి ఉడికించాలి. తగినంత ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి దింపేయాలి. పుదీనా ఆకులతో అలంకరించి, రైతాతో వడ్డించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి