కొర్ర బిస్కెట్లు
కొర్ర బిస్కెట్లు
కావలసినవి
కొర్ర పిండి - ఒక కప్పు
బేకింగ్ పౌడర్ పావు టీ స్పూను
నెయ్యి - ఒక టేబుల్ స్పూను,
బెల్లం పొడి - అర కప్పు,
వెనిలా ఎసెన్స్- కొద్దిగా,
ఉప్పు - చిటికెడు
తయారీ:
ముందుగా కొర్ర పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కలిపి జల్లెడ పట్టాలి. నెయ్యిని ప్లానిటరీ మిక్సలో వేసి అరగంట సేపు బాగా కలపాలి. జల్లించిన పిండిని, బెల్లం పొడిని జత చేసి మరో ఐదు నిమిషాలు కలిపి బయటకు తీయాలి. వెనిలా ఎసెన్స్ జత చేయాలి. అంగుళం మందంలో పిండిని ఒత్తాలి. బిస్కెట్ కటర్ తో కావలసిన ఆకారంలో బిస్కెట్లను కట్ చేయాలి. 150 డిగ్రీల దగ్గర అవెనన్ను ప్రీ హీట్ చేసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో ఉంచి సుమారు అరగంటసేపు బేక్ చేసి బయటకు తీయాలి కొద్దిగా చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి, ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి