కొర్ర దోసె
కొర్ర దోసె
కావలసినవి:
కొర్రలు - 3 కప్పులు,
మినప్పప్పు-ఒక కప్పు,
ఉప్పు - తగినంత,
మెంతులు - పావు టీ స్పూను
నూనె - తగినంత
తయారీ మెంతులు, మినప్పప్పు, కొర్రలను విడివిడిగా తగినన్ని నీళ్లు జత చేసి, ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేయాలి. గ్రెండర్లో మినప్పప్పు కొర్రలు మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ దోసెల పిండి మాదిరిగా మెత్తగా రుబ్బుకోవాలి సుమారు ఆరేడు గంటలు బాగా ఉచిన తరవాత తగినంత ఉప్పు జత చేయాలి. స్టామీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి నూనె వేయాలి. రుబ్బి ఉంచుకున్న పిండిని గరిటెతో తీసుకుని దోసి మాదిరిగా వేయాలి. చుట్టూ నెయ్యి/ నూనె వేసి కాలిన తరవాత, తిరగేసి రెండో వైపు కూడా కాలిన తరవాత ప్లేటులోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి