కొర్ర సాంబారు అన్నం

 





కావలసినవి


కొర్ర బియ్యం - ఒక గ్లాసు, 

కంది పప్పు - ఒక గ్లాసు

చింతపండు గుజ్జు - 2 టీ స్పూన్లు

ఉప్పు - తగినం

కూరగాయ ముక్కలు - ఒక కప్పు (క్యారట్, బీన్స్, మునగకాడ

మొదలైనవి

నెయ్యి లేదా నూనె - 2 టీ స్పూన్లు

 కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు

 బిసిబేళబాత్ మసాలా - 2 టీ స్పూన్లు 

పోపు కోసం

 ఆవాలు - ఒక టీ స్పూన

కరివేపాకు - 2 రెమ్మలు

 ఎండు మిర్చి 2

పచ్చిమిర్చి-2- 

జీడిపప్పు - 10 

ఇంగువ - పావు టీ స్పూను

 ఉల్లి తరుగు - పావు కప్పు

 తయారీ


కొర్ర బియ్యం, కంది పప్పులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలోవిడివిడిగా సుమారు మూడు గంటలపాటు నానబెట్టాలి. కూరగాయ ముక్కలను ఉడకబెట్టి వక్కన పెట్టుకోవాలి. ఐదుగ్లానుల నీరు మరగబెట్టాలి. నీళ్లు మరుగుతుండగా కంది పప్పు వేసి మూడు వంతులు ఉడికిన తరవాత, కొర్ర బియ్యం కూడా చేర్చి మెత్తగా ఉడికించాలి. స్థా మీద బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు జీడిపప్పులు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. చింత పండు గుజ్జు, ఉప్పు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి బిసిబేళబాత్ మసాలా వేసి కలపాలి మెత్తగా ఉడికించిన కొర్రబియ్యం , కంది పప్పు మిశ్రమాన్ని జత చేసి, మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. కొత్తిమీర, నెయ్యి వేసి కలియబెట్టి అప్పడాలు, కారబ్బూందీ, పిండి వడియాలతో వేడివేడిగా వడ్డించాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు