కొర్ర మామిడి అన్నం







 కొర్ర మామిడి అన్నం


కావలసినవి


కొర్ర బియ్యం - ఒక గ్లాసుడు 

మామిడి తురుము - అర కప్పు


అల్లం తురుము - ఒక టీ స్పూను 

ఉప్పు - తగినంత

నెయ్యినూనె - 2 టేబుల్ స్పూన్లు

 పచ్చి సెనగ పప్పు 2 టీ స్పూన్లు

 మినప్పప్పు 2 టీ స్పూన్లు

 ఆవాలు - ఒక టీ స్పూను

 మెంతులు - పావు టీ స్పూను

 పసుపు - పావు టీ స్పూను

 ఇంగువ - పావు టీ స్పూను

 కరివేపాకు - 3 రెమ్మలు తయారీ

ఎండు మిర్చి - 4

 తరిగిన పచ్చి మిర్చి - 5



కొర్ర బియ్యాన్ని సుమారు మూడు గంటలపాటు నానబెట్టిన తరవాత నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి అన్నం ఉడికించాలి ఉడికిన కొర్ర అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక ప్లేటులో ఆరబెట్టుకోవాలి. స్టామీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, వచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, అల్లం తురుము, వచ్చి మిర్చి తరుగు ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మామిడి తురుము జత చేసి ఐదు నిమిషాల పాటు వేయించి, దింపి చల్లారాక, కొర్ర అన్నంలో వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. రెండు గంటల పాటు బాగా ఊరిన తరువాత తినాలి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లుక్ష్మీ సమోసా

ోనట్ ప్న్ కర్రి

బియ్యం నీరు